బెజవాడ బాధితులకు నిత్యవసర కిట్లను పంపిణీ చేసిన జెకెసీటి |9express news

బెజవాడ బాధితులకు నిత్యవసర కిట్లను పంపిణీ చేసిన జెకెసీటి

భద్రాచలం : భారీ ఎత్తున విస్తారంగా కురిసిన వర్షాలతో విజయవాడలోని సింగ్ నగర్, దాబాకొట్టు సెంటర్. బాంబే కాలనీతో పాటుగా మరెన్నో ప్రాంతాలు జలమయమై జన జీవనం అతలాకుతలం అయింది. మీడియా మాధ్యమాల ద్వారా ప్రసార సాధనాల ద్వారా విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ లోని నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు తెలుగుదేశం నాయకులు మహమ్మద్ జమాల్ ఖాన్ తన సహచర సిబ్బందిని జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయంతో ప్రతి కుటుంబానికి ఐదు కేజీల బియ్యం, చింతపండు, ఉప్పు, పప్పు, కారం మంచి నూనె తోపాటుగా బంగాళ దుంపలు కూరగాయలను కూడా చేర్చి 500 కిట్లను విజయవాడ నగరానికి చేరుకున్నారు. నగరంలోని తొలుత సింగ్ నగర్ షాది ఖానా వీధిలో 200 మంది నిర్వాసిత కుటుంబాలకు అలాగే డాబా కొట్టు సెంటర్ లో 100 కుటుంబాలు బాంబే కాలనీలో మరో వంద కుటుంబాలు సుందర్ నగర్ లో వంద కుటుంబాల మొత్తం 500 కుటుంబాల నిర్వాసితులకు తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే నిత్యవసరాలను జేకెసిటీ ట్రస్ట్ భాద్యులు జమాల్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చేతుల మీదుగా నిత్యవసరాలను అందజేశారు. ఈ సందర్భంగా సింగ్ నగర్ షాది ఖానా కు చెందిన కొందరు నిర్వాసితులు మాట్లాడుతూ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా తమ వద్దకు వచ్చ సమస్యలను తెలుసుకొని ఇంటి వద్దకు వచ్చి సహాయం చేసిన సందర్భాలు ఏమీ లేవని ఎవరో తెలియదు మన్యప్రాంత ముంపు మండలాల్లో ఉంటున్న వ్యక్తి మీడియా మాధ్యమాల ద్వారా మా బాధలను చూసి చలించి ఇక్కడకు వచ్చి సహాయం అందించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని వారి సహాయ సహకారాలు ఎప్పుడూ అందరికీ ఉండాలని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జమాల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి మనిషి తనకోసం ఈ సమాజం ఏమి చేసిందని ప్రశ్నించే కంటే తను సమాజం కోసం ఏమి చేశానని ఆత్మ విమర్శ చేసుకోవటమే మనిషి యొక్క నిజమైన నైతికత్వమని, జీవరాశుల్లో కల్లా మానవ జీవితం ఉన్నతమైందని ఆశయాలు కూడా ఉన్నతంగా ఉంటేనే ముందుకు వెళ్లడం జరుగుతుందని సాటి మనుషులు ఆపదలో ఉంటే తనకున్న సంపదలో వారికి పంచి కష్టాలను దూరం చేసే కనీస ధర్మం ప్రతి ఒక్కరూ పాటిస్తే ఏ ఒక్కరు కూడా మానవ సమాజంలో ఇబ్బందులకు గురికారన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను ఓదారుస్తూ సహాయ కార్యక్రమాలను ముందుకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సుభాని, షేక్ గౌస్ బాషా, షేక్ సుభాని, నాగుల్ మీరా, టీడీపీ నాయకులు మాజీ జడ్పిటిసి ముత్యాల రామారావు , జెడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి, బురక కన్నారావు, పాయం రామారావు, రసూల్, శ్రీరామ్, పుట్టి రమేష్ బాబు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కనితి మధు, వెంకన్న, సురేశ్, సూఫీ సర్ఫరాజ్ అలీ, జెకె సిటీ ట్రస్ట్ సభ్యులు జావేద్, రియాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *