విప్ప లడ్డూ కావాలా నాయనా…

విప్ప లడ్డూ కావాలా నాయనా…

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న విప్ప లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఐటీడీఏ పీవో రాహుల్. అడవుల్లో సహజసిద్ధంగా లభించే విప్పపువ్వులో డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి లడ్డూలు, ఔషధ గుణాలున్న వనమూలికలతో కారంపొడి, పచ్చళ్ళు తయారు చేసి విక్రయిస్తూ స్వశక్తితో చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పి జీవనోపాధి పొందుతున్న ఆదివాసి మహిళలను పీవో రాహుల్ అభినందించారు. ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ కు బ్రాండింగ్, ప్యాకింగ్ కు కావాల్సిన మిషనరీని ఐటీడీఏ ద్వారా అందించి మరింత అభివృద్ధి అయ్యేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *