భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకోగా క్రమంగా పెరుగుతూ 43 అడుగులుదాటి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు, గోదావరి వరద ఉద్ధృతి 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులను ఎప్పటికప్పుడు గజ ఈతగాళ్లు అలర్ట్ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాల కోసం వెళ్లిన భక్తులకు లోతుకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు