నీట మునిగిన సీతమ్మ తల్లి

నీట మునిగిన సీతమ్మ తల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ ) గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతమ్మ వాగు పొంగిపొర్లుతుంది. ఈ వాగు పొగడంతో సీతమ్మ తల్లి నార చీరల ప్రాంతం, శ్రీరాముడు పాదాల గుర్తులు, అక్కడ ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం సమాప్తం నీట మునిగాయి. దీంతో సీతమ్మ నారా చీరల ప్రాంతానికి భక్తులను ఎవరిని కూడా అటువైపు అధికారులు వెళ్ళనివ్వలేదు. దీంతో భక్తులు వెనుతిరిగి వెళ్లారు. మూడు రోజులపాటు సెలవులు రావడంతో భక్తులు పర్ణశాలకు భారీగా చేరుకున్నారు. రామాయణ ఘట్టంలోని ఎంతో ముఖ్యమైనది పర్ణశాల దివ్య క్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి సీతమ్మ తల్లి నడిఆడిన ప్రదేశం పర్ణశాల ప్రాంతం అప్పటి గుర్తులు ఇప్పటికీ సీతమ్మ వాగు సమీపంలో ఉన్నాయి. పర్ణశాల వచ్చే ప్రతి భక్తులు ఆ యొక్క గుర్తులను చూసేందుకు ఎంతో ఆశపడతారు అలాంటిది వర్షాలు కారణంగా వాగులు వంకలు పొంగడంతో ఆ ప్రాంతం మొత్తం నీట మునిగింది, అంతేకాకుండా సీతమ్మ తల్లి విగ్రహం కూడా పూర్తిగా నీట మునగడంతో అక్కడికి చేరుకున్న భక్తులకు చూసే అవకాశం లేనందున రాములోరి సన్నిధిలో ఉన్న రామాయణ చిత్రాలను వీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *