భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..!

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ) ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి క్రమేపి పెరుగుతుంది. శనివారం సాయంత్రం 23 అడుగుల మేరా చేరుకున్న గోదావరి ఆదివారం ఉదయానికి 33. మూడు అడుగులు చేరుకుంది. రాత్రి 9 గంటలకు 34 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు మూడు అడుగులకు చేరుకొని తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్లు సిడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు. లోతటి ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అదేవిధంగా భద్రాచలం స్థాన ఘట్టాల వద్ద పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న చిరు వ్యాపారాలను కాళీ చేయి సుదూర ప్రాంతాలకు తరలించారు. గోదారిలో పుణ్య స్థానాల ఆచరిస్తున్న భక్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ గజ ఈతగాళ్లు మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. గోదావరి నదిలో హెచ్చరిక బోర్డులను పెట్టి అటువైపు ఎవరిని కూడా వెళ్లకుండా తగు ఏర్పాట్లు చేశారు.

గోదావరి వద్ద పోలీస్ పహారా

మూడు రోజులు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ మడిపల్లి నాగరాజు, ఎస్ఐలు గంజి స్వప్న, బేవర రామకృష్ణ లు గోదావరి నది ఉదృత ప్రవాహాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు కానిస్టేబుళ్లను స్నాన ఘట్టాల వద్ద పహారా కాసే విధంగా తగు ఏర్పాట్లు చేశారు . డేంజరస్ ప్లేస్ లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేసి గజ ఈతకాలను అలర్ట్ చేసి వారికి తగు సూచనలు అందించారు. అంతేకాకుండా గోదావరి వరద ఉధృతి 35 అడుగులు దాటితే బోటింగ్ ను కూడా నిలిపివేయాలని బోట్ షికార్ యజమానికి హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *