విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ
* రెండేళ్లుగా కమిషన్ల పేరుతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
* అబద్దాల పునాదులపై రేవంత్ పాలన
* విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంటుకు మొండి చెయ్యి
భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ విద్యను గాడిన పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. పి డి యస్ యూ రాష్ట్ర కమిటీ గ్రూపులో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలో విద్యార్థి పోరుబాట యాత్రను రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ బిగిపిడికిలి జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన విద్యార్థి పోరాట యాత్ర ప్రభుత్వ పాఠశాల, గిరిజన బాలికల వసతి గృహం, బాలుర ఆశ్రమ పాఠశాలలను జీబు జాత బృందం సందర్శించింది. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేత మునిగెలా శివప్రశాంత్ అధ్యక్షత వహించి పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ మాదిరిగానే నేడు రేవంత్ రెడ్డి కూడా అబద్ధాల పునాదులపై పాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ విద్యా సంక్షేమాన్ని మరిచి తన రాజకీయ మైలేజ్ మార్క్ కోసమే కొత్త విద్యా విధాన రూపకల్పన చేశారని, అందులో భాగంగానే న్యూ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ,స్కిల్ యూనివర్సిటీల పేరుతో ఒక్కొక్క పాఠశాలకు 200 కోట్లు కేటాయించామని రెండేళ్లు అయినా ఒక్క పునాదిరాయి కూడా వేయలేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో విద్య కమిషన్ ఏర్పాటు పేరుతో రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసి విద్యా కమిషన్ సూచించిన ఏ ఒక్క అంశాన్ని కూడా పరిష్కరించలేదని వారు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లేకపోయినా, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని సూచించిన, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించిన ఏ ఒక్కటి కూడా పట్టింపు లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను సుమారు పది లక్షల మంది విద్యార్థులకు 8600 కోట్ల రూపాయలు బకాయిలు నేటికీ చెల్లించకపోవడం అసమర్థ ప్రభుత్వానికి నిదర్శనం అనేవారు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాఠశాలలో మరుగుదొడ్ల సమస్యను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని కంప్యూటర్లు లేని పాఠశాలలు అనేకం ఉన్నాయని, 5000 పాఠశాలలో విద్యార్థి నేలకు టాయిలెట్ సౌకర్యం లేదని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలని వారు విమర్శించారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మెనూ అమలు కావడం లేదని ప్రస్తుత ధర కనుగుణంగా మెనూ చార్జీలు రూపొందించలేకపోవడం అదేవిధంగా విద్యార్థులకు అందించే ఆహారానికి తగిన ప్రాతిపదికన కిరాణా సప్లై లేదని వారు తెలిపారు. తక్షణమే నూతన గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి పోరు బాట యాత్ర బృందం సభ్యులు బి.సాయి రామ్ చరణ్,శ్రావణి, విష్ణు,సంధ్య,భార్గవి,పవన్ కళ్యాణ్,లోకేష్,తరుణ పాల్గొన్నారు.\