పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం

పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం
పర్ణశాల వద్ద గోదావరి నదీ ఉదృతి పెరగడంతో ఎగపోటు కారణంగా సీతవాగు ఉప్పొంగడంతో సీతమ్మ విగ్రహం పూర్తిగా నీటమునిగి పోయింది. పర్ణశాలలో సీతారామలక్ష్మణుడు ఆడుకున్న వామన గుంటలు, రాముడి రాతి సింహాసనం, సీతమ్మ నారచీరలు, శూర్పణక్క గుట్ట ప్రాంతం అంతా నీటమునిగింది. వరదల వల్ల భక్తుల రాక లేకపోవడంతో పర్ణశాల ఆలయంతో పాటు కుటీర ప్రాంతమంతా నిర్మానుషంగా మారింది.