కార్మికులను కష్టపెట్టిన ప్రభుత్వాలు కొనసాగిన చరిత్ర లేదు : సీఐటియు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గ్రామపంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురిచేసి పస్తులించిన ఏ ప్రభుత్వం కొనసాగిన చరిత్ర లేదని సిఐటియు పట్టణ కన్వీనర్ ఎం బి నర్సారెడ్డి అన్నారు.
కనీస వేతనం ఉద్యోగ భద్రత కోసం సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండవ రోజు యధా విధంగా కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద వివిధ రకాల నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎవరూ చేయలేనటువంటి పనులను గ్రామపంచాయతీ కార్మికులు ఎంతో ఇష్టంగా పని చేస్తున్నప్పటికీ వారి ఖాళీ కడుపుతో ఇబ్బందులు పెట్టడం సరైనది కాదని అన్నారు. సరైన వేతనం రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల పాలవుతూ అనారోగ్యాల గురవుతూ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలించిన ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకపోవడం వలన ఆ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ,ప్రమాద బీమా పథకాన్ని 10 లక్షలు చేయాలని అదేవిధంగా,పని భద్రత కల్పించాలని ,అధికారుల వేధింపులను ఆపాలని, డిమాండ్ చేశారు. అర్హులైన వారిని పర్మినెంట్ చేయాలని, తదితర డిమాండ్లతో కార్మికులు చేస్తున్న ఈ సమ్మెను ప్రభుత్వం అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిశీలించకపోతే రాబోయే కాలంలో నిరవధిక సమ్మె చేయటానికి కూడా వెనకాడా పోమని హెచ్చరించారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలు కూడా సంఘీభావాన్ని తెలియజేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి చర్చలకు పిలిచి వారి సమస్యలను డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నర్సారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు N నాగరాజు ,ఏ రత్నం, మనోజ్ రెడ్డి, వీరన్న, విజయ, భాను, అనసూయ, సుశీల, ప్రసాద్ రెడ్డి పీ, భద్రమ్మ ,మరియు కార్మికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *