పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత : 9ఎక్స్ప్రెస్ న్యూస్ టీం|9express news

పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత : 9ఎక్స్ప్రెస్ న్యూస్ టీం
భద్రాచలం : మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడాలని రాబోయే భావి తరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాలనేదే ముఖ్య ఉద్దేశం అని 9ఎక్స్ప్రెస్ న్యూస్ టీం అధ్వర్యంలో మట్టి గణనాథుని విగ్రహాలను ఉచిత పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ సెంటర్ నందు వినాయక చవితి సందర్భంగా 1000 మట్టి విగ్రహాలను పంచుతూ పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ భక్తులు పర్యావరణ పరిరక్షణకై మట్టితో తయారు చేసిన విగ్రహాలకు పూజ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ 9ఎక్స్ప్రెస్ న్యూస్ టీం నేతృత్వంలో ప్రత్యేకంగా మట్టితో తయారుచేసిన గణనాథుని విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకై తోడ్పడుతున్న 9ఎక్స్ప్రెస్ న్యూస్ మీడియా బృందానికి భద్రాచలం పట్టణ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సమాజ సేవ సంఘ కర్త జిందా, జర్నలిస్టులు లక్ష్మీకాంత్, రవికుమార్, తమ్మల్ల రాజేష్, పుష్పగిరి తదితరులు పాల్గొన్నారు.