గోతికాడి గుంట నక్కలా చూస్తున్నారు : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాట్ కామెంట్స్|9express News

గోతికాడి గుంట నక్కలా చూస్తున్నారు : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాట్ కామెంట్స్

భద్రాచలం : హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా… ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కొంత మంది నాయకులు గోతికాడి గుంటనక్కలా చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసిన 9ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి నెగ్గి బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి మంత్రి పదవులు అనుభవించారు కదా..? ఆ రోజు ప్రజాస్వామ్యం కనిపించలేదా..? అని ఎద్దేవా వేశారు. అప్పుడు వారి నియోజకవర్గం అభివృద్ధికి వెళ్లమన్నారు.. కద ఇప్పుడు నేను అంతే నా నియోజకవర్గం అభివృద్ధి కోసం నా ప్రజల అభిప్రాయం తీసుకునే వెళ్లాను. నేను తీసుకున్న నిర్ణయానికి వెనకడుగు వేయను, భయపడే ప్రసక్తే లేదు దేనికైనా సరే చూసుకుందాం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. నాకు నా ప్రాంతం అభివృద్ధే ప్రధానం, నాకు పెద్దలు పెంగులేటి, బట్టి, తుమ్మల ఉన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటా ఏమైనా సరే అన్నారు. నాపై సిఎం రేవంత్ రెడ్డి గారికి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *