అన్నదానం చేస్తూ అనాధలను పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్న సామాజిక సేవా కార్యకర్త పాలూరి సిద్ధార్థ

భద్రాచలం 9ఎక్స్ ప్రెస్ న్యూస్ ; ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రాజ్యం నియోజకవర్గం లో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో అనాధలకు అన్నదానం కార్యక్రమం నేటికీ 213 రోజులు అయినట్లు సామాజిక సేవ కార్యకర్త పాలూరి సిద్ధార్థ తెలిపారు. ఎంతోమంది అభాగ్యులు నిరస్రాయులకు సిద్ధార్థ అనాధాశ్రమంలో అన్నదానం చేస్తూ వారి యొక్క ఆకలి తీరుస్తూ కడుపునింపుతున్నారు. అంతేకాకుండా వారందరిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లి దైవ దర్శనం చేయిస్తున్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో కూడా వీరందరిని తీసుకువచ్చి రెండు మూడు రోజులు పాటు సత్రంలో ఉంచి శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం కల్పించారు, విజయవాడ తిరుపతి వేములవాడ ఇలా అన్ని దేవాలయాలకు వీరిని వెంటబెట్టుకొని తీసుకువెళ్లి దగ్గరుండి దర్శనాలు చేయిస్తున్నారు సిద్ధార్థ. సిద్ధార్థ సేవా కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు ప్రశంసలు పత్రాలు అందజేశారు. సిద్ధార్థ 2014లో ఏపీ ఎన్ ఓటర్ అవార్డు ఈ అవార్డు ఏపీ ఈసీ అందుకున్నట్లు తెలిపారు సిద్ధార్థ. కానీ పెంచి ఉన్నత చదువు చదివించి ఒక స్థాయికి ఎదిగిన కొడుకులు కూడా పట్టించుకోకుండా వదిలేయడంతో వీరందరిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న సిద్ధార్థుని శభాష్ అంటున్నారు విజయనగరం జిల్లా వాసులు. మీ అందరి సహాయ సహకారాలు వాళ్ల ఇదంతా జరుగుతుందని సిద్ధార్థ తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే 9618961868 నెంబర్ కి ఫోన్ చేయగలరని సిద్ధార్థ వేడుకుంటున్నారు.