భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
భద్రాచలం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు చేరడంతో భద్రాచలం వద్ వరద ఉధృతిద 39 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న శ్రీరాం సాగర్, ఇంద్రావతి, ప్రాణహిత నుండి వరద నీరు గోదావరిలో చేరడంతో ఈరోజు రాత్రికి గోదావరి ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలంలోని విస్తా కాంపెక్స్ వద్ద ఉన్న స్లూయిస్ లు లీక్ అరికట్టేందుకు ఇసుకబాస్తాలు వేసి లీకేజీని నివారించేందుకు అధికారులు తగు జాగ్రత్తలు తీడుకుంటున్నారు. వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో తెలంగాణ చత్తీష్ఘడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద వరద ఉదృతి పెరగడంతో అధికారులు స్థానికంగా ఉండి ముంపు ప్రాంత ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు.