జనసేన అధినాయకుడు పుట్టినరోజుకు జమాల్ ఖాన్ సందడి

జనసేన అధినాయకుడు పుట్టినరోజుకు జమాల్ ఖాన్ సందడి
భద్రాచలం : అల్లూరి సీతారామరాజు ఎటపాక మండలంలోని సోమవారం డిప్యూటీ సీఎం జనసేన అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జమాల్ ఖాన్ కేక్ కట్ చేసి సందడి చేశారు. జనహృదయములో జనం గుండెల్లో అభిమానం నింపుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను వైభవంగా ఎటపాకల మండలం సీతారాపురం గ్రామంలో నిర్వహించారు. డీజే పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ఒకపక్క గోదావరి వరదలు చుట్టుముట్టుతున్నా కానీ ముంపు మండలాల్లో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మాత్రం అభిమానులు బైకులపై రోడ్డు షోలు నిర్వహిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. వాడవాడలా జనసేన జెండాలతో కళకళలాడింది. ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో పాల్గొనటం విశేషం. ఈ సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా స్వాగతించి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేకును ఆయన చేతుల మీదుగా కట్ చేయించి చిన్నారులకు స్వయంగా తినిపించడం జరిగింది. ఈ తీపి గుర్తులు కలకాలం ఉండాలని యువత పార్టీకి వెన్నెముకగా అండదండగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతను చైతన్యం వైపు తీసుకుపోవాలని నేటి యువతే రాబోయే కాలానికి వెన్నెముకగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో ఎటపాక మండల అధ్యక్షుడు మారాజు గంగాధర్, గ్రామ పెద్దలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.