మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం

మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం
సత్తుపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ శంకుస్థాపన వేడుకకు హాజరుకావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని సేవ్ భద్రాద్రి టీం ఆహ్వానించింది. తుమ్మల నివాసమైన గండుగలపల్లిలో మంత్రిని సేవ్ భద్రాద్రి టీం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ భద్రాద్రి సృష్టికర్త పాకాల దుర్గాప్రసాద్, ఎస్కే రసూల్, యశోద రాంబాబు, షేక్ అజీమ్, పచ్చనీలం మునికేశవ్, భీమవరపు వెంకట్ రెడ్డి, పరిమి సోమశేఖర్, చారుగుళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు