కాటేసిన కరెంటు.. ధైర్యమిచ్చిన డా. జమాల్ ఖాన్

కాటేసిన కరెంటు.. ధైర్యమిచ్చిన డా. జమాల్ ఖాన్
భద్రాచలం : కరెంటు పనులు చేసుకుంటూ చిన్నపాటి కుటుంబాన్ని నెట్టుకుంటూ రెక్కల కష్టంపై బ్రతుకు బండిని లాగుతున్న ఓ కుటుంబ యజమాని కరెంటు మృత్యు రూపంలో కాటేసి ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేసింది. కూనవరం మండలం పల్లూరు గ్రామానికి చెందిన ఆవుల వెంకట రామారావు ( 28) అనే యువకుడు ఆదివారం కరెంటు పనులు చేసేందుకు ఓ ఇంటికి వెళ్లి మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి భార్య ఒక 11 నెలల పసిపాప ఉన్నారు. పిల్లల ఆలాన పలనా చూడకుండానే జీవితంలో ఇంకా ఎన్నో అనుభవించాల్సిన వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన తరుణంలో కరెంటు రూపంలో కాటు వేయడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ సోమవారం హుటాహుటిన పల్లూరు గ్రామానికి చేరుకొని ఆవుల వెంకట రామారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కష్టాలకు ఎదుర్కొనేందుకు మనో నిబ్బరంకు మించిన శక్తి లేదని ఆ దైవమే కుటుంబానికి ఒక చక్కటి దారి చూపిస్తుందని విధివివ్రాత ఎవరూ మార్చలేరని ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఎంత సాయం చేసిన జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చి లేరని తన వంతు సాయంగా జేకేసిటీ ద్వారా ట్రస్ట్ 5000. రూపాయలు నగదును వెంకట రామారావు భార్య రమణకు అందజేశారు. పరామర్శించిన వారిలో కూనవరం గ్రామ పెద్దలు ఏడవల్లి భాస్కర్ రావు, షేక్ రసూల్, శ్రీమంతుల సతీష్, సీతారాములు, విజయ్, కర్ణాటి శ్రీను, సత్యనారాయణ గోపాలం తదితరులు పాల్గొన్నారు.