ముంపు వాసులకోసం..! మూడంతస్తుల భవనం..!!

ముంపు వాసులకోసం..! మూడంతస్తుల భవనం..!!
భద్రాచలం : ఆగస్ట్ వచ్చిందంటే చాలు భద్రాచలం వద్ద గోదావరి నది ఎప్పడు ఉగ్రరూపం దాలుస్తుందోనని పట్టణంలోని ముంపు వాసులు ప్రాణం అరచేతిలో పెట్టుకుని పిల్లా పాపలు, వృద్ధులతో పరుగెత్తే వరద బాధితులను చూసి చలించిపోయిన పట్టణ ప్రముఖుడు పాకాల దుర్గాప్రసాద్ కన్న వారికి, ఉన్న ఊరుని మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని సేవ్ భద్రాద్రి పేరిట విరాళాలు సేకరించి ముంపువాసులకు ప్రత్యేక భవన నిర్మాణంకై కంకణం కట్టుకుని స్వంత పనులను మానుకుని విరాళాలు సేకరణకు పట్టణ ప్రముఖులను కల్పుకుని కాలనీల్లో గడపగడపకు తిరిగి కాలనీ ప్రజలను, వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేస్తూ పట్టణంలో ర్యాలీలు నిర్వహిస్తూ ముప్పై అయిదు లక్షల రూపాయలను విరాళంగా సేకరించి భవన నిర్మాణంకై ప్రభుత్వ స్థలం కేటాయించిన 17 సెంట్ల స్థలంలో ముంపు వాసులకు మూడంతస్తుల భవనాన్ని నిర్మించనున్నట్లు ఇక నుండి ముంపు కష్టాలు తొలగనున్నట్లు సేవ్ భద్రాద్రి సృష్టికర్త పాకాల దుర్గాప్రసాద్ తెలిపారు.