భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ..! శాష్ట్రోక్తంగా శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం…!!

భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ..! శాష్ట్రోక్తంగా శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం…!!
భద్రాచలం : భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ భక్తులు రాసిన శ్రీరామకోటి పుస్తకాలను దేవస్థానం అధికారులు సంప్రదాయ బద్దంగా భద్రాద్రిలో శోభాయమానంగా యాత్ర నిర్వహించి పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు. శ్రీరామకోటి పుస్తకాలను లారీల్లో తరలించే ముందు మేళతాళలతో వేద పండితుల మంత్రోచ్ఛరణ, భక్తుల కోలాటాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో రమాదేవి గోదారమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను సమర్పించి అనంతరం శ్రీరామకోటి పుస్తకాలను శిరస్సుపై ధరించి శాస్త్రోక్తంగా గోదావరిలో నిమజ్జనం చేశారు. గోదారమ్మకు వైదిక సిబ్బంది సాంప్రదాయబద్దంగా నదీ హారతులను సమర్పించారు.