అంటు వ్యాధులు ప్రబలకుండా ఆదివాసీల అసలు రహస్యమిదే..!

అంటు వ్యాధులు ప్రబలకుండా ఆదివాసీల అసలు రహస్యమిదే..!
భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గ్రామాల్లో విష జ్వరాలతో పాటు అంటు వ్యాధులు ప్రబలకుండా సాంప్రదాయమైన ముడి లందను తాగుతూ ఆరోగ్య రహస్యాన్ని కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వస్తుందంటే చాలు ముందుగానే రెండు రోజులపాటు బియ్యాన్ని నానబెట్టి మెత్తగ దంచి కాచిన లందను ఆదివాసీ గ్రామ గిరిజనులంతా పిల్లా పాపా వృద్ధులు తేడా లేకుండా పచ్చటి ఆకులను డొప్పలుగా మలిచి ఆదివాసీలంతా ఒకే చోటుకు చేరి మమేకమైన గిరిజనులంతా ముడి లందను సేవించడంతో ఎటువంటి ఏ చిన్న జబ్బులు కూడా ఆ గిరిజన గ్రామం దరి చేరవని వారి నమ్మకం. నిత్యం పచ్చటి ప్రకృతి మధ్య స్వచ్ఛమైన గాలి పీల్చుతూ కష్టాన్నే నమ్ముకున్న వీరికి జబ్బున పడి టాబ్లెట్ వేసుకున్నవారు లేరంటే అతోషయోక్తి కాదు.