ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు

భద్రాచలం నైన్ ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు పడుతున్న అష్టకష్టాలను చూసి చలించి పోయిన ప్రధానోపాధ్యాయుడు వీరాస్వామి సొంత ఖర్చులతో రహదారి నిర్మించి ఔదార్యం చాటుకున్నాడు. చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి సరైన రహదారి లేక మోకాల్లోతు బురదలో రెండు కిలోమీటర్ల మేర పురిటి నొప్పులతో బాధపడుతున్న రవ్వ ఉంగి అనే ఆదివాసి మహిళను మోసుకెళ్లిన ఘటనను చూసి చలించిన ఆయన గ్రామస్థులందరిని సమావేశ పరిచి అంతా తనకు సహకరిస్తే తన సొంత ఖర్చులతో రోడ్డు నిర్మాణం చేపడుతానని చెప్పగా గ్రామస్తులందరూ శ్రమదానానికి ముందుకు రాగా ప్రధానోపాధ్యాయుడు వీరస్వామి వెంటనే జేసీబీలు, ట్రాక్టర్లు, తెప్పించి లక్ష రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి రోడ్డు పనులు పూర్తి చేయడంతో ప్రధానోపాధ్యాయుడు చేసిన ఉపకారాన్ని ఎన్నటికి మరచిపోలేమని గ్రామస్తులు అభినందించారు.

Please follow and like us:
Pin Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *