సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ అధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ అధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
భద్రాచలం : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎటపాకలో ఉన్న సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రేపు జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ క్యాంప్ వద్ద కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ జాతీయ జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. సిఆర్పిఎఫ్ క్యాంప నుంచి మూడు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి నవోదయ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు జాతీయ పతకాన్ని అందజేసి గొప్ప తనాన్ని వివరిస్తూ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు స్వీట్లు పంచిపెట్టారు. విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను సిఆర్పిఎఫ్ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ కమాండెంట్ గజేంద్ర బహుదూర్ సింగ్, దినేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.