భద్రాచలంలో TWJF తృతీయ జిల్లా మహాసభలు – రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి

భద్రాచలంలో TWJF తృతీయ జిల్లా మహాసభలు – రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి
భద్రాచలం/చర్ల:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) తృతీయ జిల్లా మహాసభలు జూలై 12, 13 తేదీల్లో భద్రాచలం పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు TWJF రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కర్ర అనిల్ రెడ్డి తెలిపారు. చర్ల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ, మహాసభల మొదటి రోజైన జూలై 12న జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రొఫెషనల్ స్కిల్ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ హక్కుల సాధన కోసం ముందుండే ఏకైక జర్నలిస్టు సంఘం TWJF అని పేర్కొన్నారు.
TWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేపట్టి, అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సంఘం అని గుర్తు చేశారు. భద్రాచలంలో నిర్వహించనున్న మహాసభల విజయవంతతకు యూనియన్ సభ్యులే కాకుండా, ప్రతి ఒక్కరు తమ వంతుగా సహకారం అందించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పూదోట సూరిబాబు, కోశాధికారి దొడ్డి హరినాథ వర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి. రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి శీరపు సాయి సంపత్ రెడ్డి తదితర TWJF నేతలు పాల్గొన్నారు.