పాత్రికేయులకు పక్కా ఇల్లు మంజూరు చేయాలి: TWJF రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి

పాత్రికేయులకు పక్కా ఇల్లు మంజూరు చేయాలి: TWJF రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి
చర్ల, జూన్ 3: ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తూ నిరంతరం శ్రమించే పాత్రికేయులకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
TWJF సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పాత్రికేయులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి, వారి కుటుంబాలకు విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ఉదారత చూపాలన్నారు.
“భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలోని జర్నలిస్టులు అంకితభావంతో ప్రజాసేవలో భాగమవుతున్నారు. వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి,” అని ఆయన పేర్కొన్నారు.
షెడ్యూల్ ఏరియాలలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల పిల్లల చదువులకు ప్రైవేట్ పాఠశాలల్లో రాయితీలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో TWJF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఉదోట సూరిబాబు, కోశాధికారి దొడ్డి హరీ నాగవర్మ, ఉపాధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, సభ్యులు పుష్పగిరి, జి. లక్ష్మణ్ కుమార్, బి. రాధిక, ఎం. సాగర్, బి. వినోద్, మద్ది లక్ష్మీనరసింహ రెడ్డి, జి. సురేష్ రాజేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.