ఆలుగను తరలిస్తున్న ముఠా అరెస్ట్

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : అటవీ జంతువుల గోర్లు, చర్మాలు, కొమ్ములకు విదేశాల్లో డిమాండ్ ఉండడంతో వేటగాళ్లు అడవుల్లో మాటు వేశారని చెప్పడానికి ఇదే ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం అడవుల్లో నుంచి ఒక అడవి అలుగను అమ్మడానికి ఆటోలో తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అడవి అలుగుపై ఉండే పొలుసులు మందుల తయారీలో వాడతారని చెప్పి విక్రయించడానికి తీసుకెళ్తుండగా అటవీ శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. అడవి అలుగను ఆటోలో తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసినట్లు రేంజ్ అధికారిని కమల తెలిపారు. పట్టుబడిన అడవి అలుగు తెలంగాణ ,చత్తీష్ఘడ్, ఒడిశా అడవుల్లో మాత్రమే ఉంటుందని ఇది కేవలం చెదపురుగులు వంటివి తిని జీవిస్తుందని, పండ్లు ఆకులను ఆహారంగా తీసుకోదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ జీవినీ వారు పట్టుకునే క్రమంలో దానికి దెబ్బ తగిలిందని చికిత్స అనంతరం అడవి అలుగును అడవుల్లో వదిలేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇది అరుదుగా దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపిస్తుందని సైంటిస్టులు తెలుపుతున్నారు