కారు అడ్డాలో కత్తిపోట్ల కలకలం

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాద్రి జిల్లా భద్రాచలం బస్టాండ్ సమీపంలో ఉన్న భద్రాద్రి టాక్సి డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కర్ స్టాండ్ లో అడ్డంగా ఉన్న కారును తీయాలని వీరబాబు చెప్పడంతో బానోతు శ్రీను కారు తీయకుండా వాదనకు దిగడంతో వాగ్వివాదం పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. బానోత్ శ్రీను, అతని కుమారుడు శశిలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ వీరబాబు, వెంకన్నలపై కత్తులతో దాడి చేయడంతో కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాలపాలైన వీరు అపస్మారక స్థితిలో పడిపొగ గమనించిన స్థానికులు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కత్తిపోట్లకు గురైన వీరబాబుకు 17 కుట్లు పడగా వెంకన్నకు 8 కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.