వంద అడుగుల మావోయిస్టు ఆర్క్ స్మారక స్థూపం నేల మట్టం

బీజాపూర్ 9ఎక్స్ప్రెస్ న్యూస్ : చత్తీష్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు అత్యంత ప్రాబల్య ప్రాంతమైన తెర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటిపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని కనుగొని భారీగా ఆయుధ తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. అనంతరం మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు జల్లెడపడుతూ మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దండకారణ్యంలో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు 100 అడుగుల మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే స్మారక స్థూపం కంట బడటంతో దానిని నేలమట్టం చేశారు. మరోవైపున సుక్మా జిల్లా గోమ్ గూడ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా PLGA నిర్మించిన మావోయిస్టుల భారీ స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేశారు.