ఆశ్రమ పాఠశాల టీచర్ల సమ్మెకు PDSU మద్దతు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఏ కార్యాలయం ముందు ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు పి డి ఎస్ యు మద్దతు తెలుపుతున్నట్లు డివిజన్ కార్యదర్శి మునిగేలా శివప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థని నాశనం చేసిందని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో అలాగే టీచర్స్ కి జీతభత్యాలు ఇచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. చెందాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ జిల్లాల్లో పేదవిద్యార్థులకు నాణ్యమైన విద్య అందరి అందించడంలో ముందుండే కాంట్రాక్ట్ టీచర్లకు గత ఆరు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాకముందు హామీలు ఇచ్చి గద్దెనెక్కి తర్వాత హామీలను నెరవేర్చే దాంట్లో ముందు ఉండకుండా టీచర్లను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు. ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లని పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయకుండా టీచర్లని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం. గిరిజన శాఖ మంత్రిని నియమించకపోవడం.
దుర్మార్గమైనటువంటి చర్యని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2100మంది కాంట్రాక్ట్ టీచర్స్ పనిచేస్తున్న వారి ఉద్యోగ భద్రత జీతభత్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాల టీచర్స్ సమ్మె చేస్తున్నారు.చదువులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పుడు యూనిట్ టెస్ట్ లు ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ చదువులు లేక ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి. ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్స్ వారితో చర్చలు చేసి వల సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయని ఎడల PDSU ఆధ్వర్యంలో ఆశ్రమపాఠశాల విద్యార్థుల్ని కూడగట్టి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.