లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గణిత పితామహుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా భద్రాచలంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన గణిత ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని గుర్తు చేశారు. 20 శతాబ్దంలోని గణిత పితామహులలో శ్రీనివాస రామానుజం ఒకరన్నారు. అటువంటి గణిత మేధావి జయంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన గణిత ప్రదర్శన ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. మహనీయుల జయంతుల సందర్భంగా విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. హిట్లర్ విద్యాసంస్థలలో మొదటినుండి మేధావుల ప్రముఖుల జయంతులు వర్ధంతిల సందర్భంగా వ్యాసరచన పోటీలు క్రీడా పోటీలు సాంస్కృతిక కళా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తద్వారా విద్యార్థులలో భయాందోళనలు స్టేజి ఫియర్ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన ఈ గణిత ప్రదర్శనను నన్నపనేని మోహన్ హై స్కూల్ గణిత ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రారంభించగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ బాబురావు విద్యాసంస్థల కో డైరెక్టర్ మాగంటి సాయి సూర్య ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు