ముక్కోటి పనులను ప్రారంభించిన ఈవో రమాదేవి

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగబోయే ముక్కోటి ఉత్సవాలకు రామాలయం ముస్తాబవుతోంది. అంగరంగ వైభంగా జరగనున్న తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఉత్తర ద్వారం ద్వారా మహాదర్శనం కోసం కమనీయంగా జరిగే వేడుకకు వచ్చే భక్తులకు స్వాగత ద్వారాల ఏర్పాటుతో పాటు రామాలయాన్ని రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు దేవస్థానం అధికారులు. డిసెంబర్ 31 నుండి రామాలయంలో రోజుకో అవతారం చొప్పున జరగబోయే దశావతారాలకు చలువ పందిళ్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఘనంగా జరగబోయే ముక్కోటి ఉత్సవాలకు రామాలయ పరిసర ప్రాంతంలో భక్తులు అడుగు పెట్టగానే దైవం ఇట్టిపడేలా భద్రాద్రి రామయ్య సన్నిధిని సర్వం సిద్దం చేస్తున్నట్లు దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు