మావోయిస్టు ఇలాఖాలో సిఆర్పిఎఫ్ రక్త నమూనాల సేకరణ

⁠* అమిత్ షా పిలుపుతో ఆదివాసీలకు దగ్గరైన సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్

* మావోయిస్టుల అణచివేతే కాదు ఆదివాసీల ఆరోగ్యమూ ముఖ్యమే

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుతో సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్, కోబ్రా భద్రతా బలగాలు ఆదివాసీల అభివృద్ధి, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మావోయిస్టు ఇలాకాగా చెప్పబడే కిష్టారం, గొల్లపల్లి ప్రాంతంలో పొటక్ పల్లి, డబ్బమార్క సిఆర్పిఎఫ్ 212( ఎఫ్ఓబి) క్యాంపుల ద్వారా కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ్ అద్వర్యంలో గిరిజనుల ఆరోగ్య, విద్య, వైద్య, పరిస్థితులను మెరుగు పర్చడమే కాకుండా మావోయిస్టులను అణచివేతలోనూ ముందున్నారని మెచ్చుకుని కితాబిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చత్తీస్గడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో అత్యంత మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన డబ్బమార్క, పొటక్పల్లి, ఆమ్మెపెండ, తెల్మడుగు, వెర్మమోడ్, వీరాపూర్ తదితర గ్రామాల ఆదివాసీలకు ఆరోగ్య పరిస్థితులను పరీక్షించెందుకు సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ అధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో జబ్బు బారిన పడి ఆకస్మాత్తుగా మృత్యువాత పడుతుండడంతో వారి మరణాలు తగ్గించేందుకు సిఆర్పిఎఫ్ ప్రత్యేక చొరవ చూపి అట్టి ఆదివాసి ప్రజలకు బ్లడ్ నమూనలను సేకరించి కావాల్సిన వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ఆదివాసి గిరిజనులకు బ్లడ్ షుగర్, టోటల్ కొలస్ట్రాల్, హెచ్ డి ఐ, ఎల్డీఎల్, ఎస్జివోటీ, ఎస్జిపిటీ, యూరిక్ యాసిడ్ హెమోగ్లోబిన్, న్యూట్రోఫిల్స్ లింకోసైటిస్, ప్లేట్లెట్ కౌంట్ వంటి తదితర టెస్టులకు గాను ఆదివాసీలనుండి రక్త నమూనాలను సేకరించి వారి ఆరోగ్య స్థితి గతులను కనుగొని ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *