అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం.. పని చేత కాకపోతే సెలవుపై వెళ్లండి…

అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం.. పని చేత కాకపోతే సెలవుపై వెళ్లండి…
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం రామయ్యను దర్శించేందుకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వరివట్టం పెట్టి స్వాగతించి రామాలయ విశిష్టతను వివరించారు అర్చకులు. రాముడిని దర్శుంచుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఉపాలయమైన లక్ష్మి తాయారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి రామయ్య ప్రసాదాన్ని అందించి శాలువాతో సత్కరించారు. తదుపరి రామలయం ఈవో క్యాంప్ ఆఫీస్ లో అధికారులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. రామాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్న అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. మాడావీధులతో పాటు దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన నిర్లక్ష్యం వహించిన అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న భద్రాచలం ఆర్డీవో, దేవస్థానం ఈఈ రవీందర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడానికి చేతకకపోతో సెలవుపై వెళ్లాలని దేవస్థానం ఈఈకి మంత్రి పొంగులేటి సూచించారు. రామాలయ అభివృద్ధి విషయంలో అధికారులు కాలయాపన చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం భద్రాచలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములను పరిశీలించి తగు సూచనలు చేశారు మంత్రి పొంగులేటి.